Friday, April 19, 2024

రెండో టెస్టు నుంచే ప్రేక్షకులకు అనుమతి

  • కేంద్ర మార్గదర్శకాలతో బీసీసీఐ ఏర్పాట్లు
  • చెన్నై వేదికగా ఫిబ్రవరి 13 నుంచి రెండో టెస్ట్

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గడంతో…క్రీడారంగ కార్యకలాపాలను తిరిగి కొనసాగించడానికి వీలుగా కేంద్రప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేయటంతో భారత క్రికెట్ బోర్డు, దాని అనుబంధ సంఘాలు ఊపిరి పీల్చుకొన్నాయి. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూనే ఇంగ్లండ్ తో జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని చివరి మూడు మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది.

50 శాతం ప్రేక్షకులతోనే టెస్టు మ్యాచ్ లు

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండోటెస్ట్ మ్యాచ్ కు…అభిమానులను అనుమతిస్తున్నట్లు నిర్వాహక తమిళనాడు క్రికెట్ సంఘం, బీసీసీఐ ప్రకటించాయి. చెపాక్ స్టేడియం సామర్థ్యం 50 వేలు కాగా…రోజుకు 25 వేల మంది చొప్పున అనుమతించనున్నట్లు తమిళనాడు క్రికెట్ సంఘం స్పష్టం చేసింది. మ్యాచ్‌ కవరేజీకి మీడియా ప్రతినిధులను సైతం అనుమతించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read : జాతీయ టీ-20 విజేత తమిళనాడు

50% audience to be allowed for India-England Test match in Chennai

అహ్మదాబాద్ టెస్టులకు లైన్ క్లియర్

అహ్మదాబాద్ లోని మోతేరాలో సరికొత్తగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియం ప్రపంచ క్రికెట్ వేదికల్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించింది. లక్షా 10వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ స్టేడియంలో…ఇంగ్లండ్ తో జరిగే మూడు,నాలుగు టెస్టులు నిర్వహించనున్నారు. మూడోటెస్ట్ మ్యాచ్ ను డే-నైట్ గానూ, ఆఖరి టెస్టును డే మ్యాచ్ గానూ నిర్వహిస్తారు. కోవిడ్ తాజా నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం రోజుకు 50 వేల మంది చొప్పున ప్రేక్షకులు..మూడు,నాలుగు టెస్టులు వీక్షించే అవకాశం ఉంది.

Also Read : సాకర్ స్టార్ మెస్సీకి కుబేర కాంట్రాక్ట్

ఇప్పటి వరకూ ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద స్టేడియంగా ఉన్న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని…అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం అధిగమించింది. మెల్బోర్న్ స్టేడియం సామర్థ్యం 90 నుంచి లక్ష వరకూ మాత్రమే ఉంది.

Also Read : సునీల్ గవాస్కర్ కు అరుదైన కానుక

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles