Saturday, October 16, 2021

శ్రీకాలమ్ – వారం…వారం

ఓయ్-ఓయ్

దేశంలో కొన్ని చోట్ల ఎన్నికల వాతావరణం నెలకొని వుంది. పొత్తులు సుత్తులు నిత్యం వినిపిస్తున్నాయ్. కొందరిపై యీ తరుణంలో శిక్షలు మాఫీ అవచ్చు, కొందరు ఇరుక్కోవచ్చు. ఏదైనా జరగచ్చు. అందుకని ప్రతి ఎన్నికా ఓ కొత్త జన్మ!

ముఖ్యమంత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘మనం పేదవారికోసం ఎన్నెన్ని సంక్షేమ పథకాలు చేపట్టామో వారికి తెలియజెప్పాలి. పక్కా ఇళ్లు, దీపం, పుశువు, ఆదరణ అన్నిటి గురించీ వివరించాలి..’’ ఆయన మాట పూర్తికాకుండానే, ‘చేస్తుంటే ఎటూ తెలుస్తుంది కదా. దానికి మళ్ళీ పబ్లిసిటీ ఎందుకు’ అన్నదొక కంఠం. ఆరాతీస్తే అన్నది ఓ పత్రికాప్రతినిధి అని తేలింది. ‘‘ చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. చెట్టు నాకు ఆదర్శం. పూత రాగానే చెట్టు,మొక్క గుబాళిస్తుంది. ఆ పరిమళం కావల్సిన క్రిమికీటకాల్ని ఆహ్వానిస్తుంది. పూత పూస్తే వాటికి తెలియదా అని వుదాసీనంగా వూరుకుంటే పుంత పుంత గానే రాలిపోతుంది. ఫలించదు. ఏమంటారు?’’ అన్నారు సూటిగా సీయమ్. ‘‘మధ్య మధ్య యిట్లాంటి సైంధవులు అడ్డుపడకుండా చూసుకోండి. మనధ్యేయం గెలుపు’’ అంటూ సమావేశం ముగించారు. పత్రికాప్రతినిధి ఏదో సాధించినవాడిలో చేటంత మొహం చేసుకు బయటపడ్డాడు.

నర్సింగ్

మంత్రివర్గ సభ వదలగానే వారివారి ఐడియాలని నెమరేసుకుంటూ పార్కింగ్ లాట్ దగ్గర తిరుగుతున్నారు. ఓ మంత్రిగారికి బుర్రలో కొత్తదీపం వెలిగింది. పట్టణాల్లో, నగరాల్లో ప్రచారం అనవసరం. ఏర్లు, వాగులు, వంకలు ఊళ్ళు దాడి వెళ్ళి కొండల్లో కోనల్లో వున్న జనానికి ఎరుకపరచడం తక్షణ కర్తవ్యం అనిపిస్తోంది. అనిపించడమేంటి మరుక్షణం మందీ మార్బలంతో రైలెక్కి, బస్సెక్కి, పడవెక్కి, కార్యకర్తల బుజాలెక్కి, చివర్లో పాదయాత్రకు సైతం తెగించి ఒక చిన్న గూడెం చేరుకున్నారు. ఈ చోద్యం చూడడానికి నాలుగు గూడేల జనం అక్కడికి చేరారు. జనాన్ని చూడగానే మంత్రిగారికి పూనకం వచ్చేసింది. ఉత్సాహ ఉద్రేకాలతో మాట్లాడారు. హైదరాబాద్ కొత్త ఐటీ పార్క్ ల గురించి, దుర్గం చెరవు తీగెల వంతెన గురించి సవివరంగా చెప్పారు. ప్రజలు వినోదంగా వింటూ మధ్య మధ్య ‘‘ఓయె…ఓయె’’ అంటూ చేతులెత్తి అరుస్తున్నారు. ఇహనించీ మీరిట్లా చెట్లకింద పుట్టల్లో వుండక్కర్లేదు. పక్కా ఇళ్లు అక్కడే నిర్మించి యిక్కడ తెచ్చిపెడతాం. గూడెం వాసులు ‘‘ఓయె…ఓయె’’ అంటూ ఉత్సాహంగా అరిచారు. గూడెంవారితో మమేకమైపోయిన పత్రికాప్రతినిధి బరబరా  కాగితాల మీద రాసేసుకుంటున్నాడు. ‘‘మీ పిల్లలు విద్యావంతులు కవాలి, కళావంతులు కావాలి. అసలు మీ బతుకులు తారుమారు కావాలి. తలక్రిందులు కావాలి’’ అనగానే చప్పట్లు ‘‘ఓయె…ఓయె’’లు మార్మోగాయి. మంత్రిగారు అయీ కాగానే హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ కొట్టి చెప్పారు. తన ‘జనదర్శనం’ (ఆయనే యీ పేరు పెట్టుకున్నారు) సూపర్ డూపర్ హిట్ అయిందని వార్తాకథనాలు పంపారు.

తిండీతిప్పలూ కూడా మర్చిపోయి, వాగ్దానాల జల్లులు కురిపిస్తూ తిరిగేస్తూ ఓయె లు అందుకున్నారు. గూడేలు దాటి వెళ్తుంటే చెట్ల కింద మేస్తున్న ఆవులూ, గేదెలూ కనిపించాయి మంత్రికి. ‘‘మీకే కాదు మీ పవువులకి, మీ గూడెం పక్షులకీ కూడా గూళ్ళు ఏర్పాటు చేసే బాధ్యత మాది’’ అంటూ మాటలు సాగిస్తూ, చొరవ చేసి వారి ఆలమందల్లోకి చొచ్చుకుపోవడం మొదలు పెట్టారు.  గమనించిన గూడెం పెద్ద ‘‘ఓయె…ఓయె’’ అంటూ మంత్రిని చెయ్యిపట్టి ఆదుర్దాగా ఆపాడు. మొదటిసారి అనుమానం వచ్చి, ‘‘ఓయె…ఓయె’’ అంటే ఏమిటని మంత్రిగారు అడిగారు. మా కొండ భాషలో ఓయె అంటే పేడ అని అర్థం. దాంతో మంత్రి మాట పడిపోయింది. ఆవులకి అవతల తనని అనుసరిస్తూ తిరుగుతున్న పత్రికాప్రతినిధి కనిపించే సరికి ‘నా పాలిట యిక్కడ కూడా దాపురించావా’ అంటూ మంత్రి పళ్లు కొరికారు. ‘‘ఓయె…ఓయె’’ అంటూ మన ప్రతినిధి ముక్తాయించాడు.

రాజకీయ సభలు వర్థిల్లాలి!

Related Articles

2 COMMENTS

  1. 😀నవ్వుల పువ్వులు పూయించే సాహితీ తోటమాలి శ్రీ రమణ గారి ఓయ్ ఓయ్ మామూలుగానే గిలిగింతలు పెట్టింది 😂😁

  2. పడుపువృత్తిలో పీకలదాకా దిగబడిపోయి , పడుపుకూడుతో  పొట్టనింపుకునే ఆగర్భ దాసీ పుత్రుల తార్పుడు రాతలివి . నాన్న , శేషేంద్ర శర్మ అన్ని ఇంటర్వ్యూల్లో , అచ్చ్చయిన  పుస్తకాల్లో తన పూర్వీకులూ , తల్లిదండ్రులు , జన్మస్థలం  వివరాలు స్పష్టంగా చెప్పాడు . ఈ  ఆగర్భ దాసీ పుత్రుడు  ఒక రజాకార్ పుంశ్చలిక ను  నాన్న భార్య గా చూపించడం కోసం వాస్తవాల్ని గాలికొదిలేసి తప్పుడు / తార్పుడు కూతలు రాసాడు . నిజాలు నిజమే చెబుతాయి . వీడు దాసీ పుత్రుడన్న నిజం బయట పడింది . వీడ్ని పాదరక్షలతో దేహ శుద్ధి చేసే పండుగ రోజు సునామీ కెరటం లా వీడి వైపు దూసుకు వస్తోంది . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles