Saturday, December 7, 2024

జాతీయ స్థాయిలో తెలంగాణ సినీపతాక : మామిడి హరికృష్ణ

శనివారం రవీంద్రభారతి థియేటర్ లో ప్రసంగిస్తున్న రామచంద్రమూర్తి. పక్కన మామిడి హరికృష్ణ, కృష్ణ, నవీన్, శివ

  • మరాఠీలో ‘లతా భగవాన్ కరే’ సినిమా నిర్మాత కృష్ణ, దర్శకుడు నవీన్, ఎడిటర్ శివకు అభినందనలు
  • ఎడిటింగ్ లో జాతీయ పురస్కారం అందుకున్న శివ

హైదరాబాద్ : ప్రతిభ, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తూ, నిజ జీవిత కథతో సినిమా తీసిన దేశబోయిన నవీన్, జాతీయ స్థాయిలో తెలంగాణ ఫిలింమేకర్స్ క్రియేటివిటీ జెండాను ఎగరవేసాడని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు అన్నారు. నిజజీవిత కథలో నిజపాత్రధారులతో సినిమా తీయడం ఇందులోని ప్రత్యేకత. నటీనటులు సామాన్య కుటుంబ సభ్యులు కావడం, ఆ కుటుంబ కథనమే సినిమాగా తీయడం విశేషం.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న ‘సినివారం’లో 2021, ఏప్రిల్ 10న “లతా భగవాన్ కరే” సినిమా టీంతో టాక్ ఎట్ సినివారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మామిడి హరికృష్ణ గారు చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి గారు పాల్గొన్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ గారు మాట్లాడుతూ… “ఏ లక్ష్యంతోనైతే ‘సినివారం’ అయిదేళ్ళ కిందట రూపొందించబడిందో ఆ లక్ష్యం ఈ రోజు నెరవేరిందని చెప్పవచ్చు. జీవితాన్ని చూపించే, జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలను రూపొందించాలన్న సంకల్పంతో ఉన్న దర్శకుడు నవీన్, మహారాష్ట్రకి వెళ్ళి నిజజీవిత పాత్రలతో మరాఠీలో సినిమా తీశాడు. మూడు కిలోమీటర్ల మారథాన్‌, ఇతర పరుగు పందాల్లో పాల్గొని విజయం సాధించి భర్త ఆరోగ్యాన్ని కాపాడుకున్న మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పెంప్లీ గ్రామానికి చెందిన లత యథార్థ కథను వస్తువుగా తీసుకొని తీసిన ఈ సినిమాకు 2020 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో స్పెషల్ మెన్షన్ అవార్డు వచ్చింది. ఇలాంటి కథాంశాలతో మరిన్ని మంచి సినిమాలు రావాలని పేర్కొంటూ, సాంస్కృతిక శాఖ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, తనకు ప్రోత్సాహాం అందిస్తున్న సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి గారికి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

కె. రామచంద్రమూర్తి గారు మాట్లాడుతూ… “రవీంద్రభారతిలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న అమెరికన్ లైబ్రరీలో అనేక ప్రపంచ సినిమాలు చూశాను. మళ్ళీ ఇప్పుడు రవీంద్రభారతిలో ఈ సినిమా థియేటర్ ను చూస్తున్నాను. యంగ్ ఫిలింమేకర్స్ కు ప్రోత్సాహం అందించడంకోసం ‘సినివారం’ వేదికను రూపొందించినదుకు మామిడి హరికృష్ణ గారికి అభినందనలు. రియల్ పాత్రలతో ‘లత భగవాన్ కరే’ సినిమా తీసిన వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కావడం మాకు గర్వంగా ఉంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో “లతా భగవాన్ కరే” సినిమా డైరెక్టర్ దేశబోయిన నవీన్, ఎడిటర్ బొడ్డు శివకుమార్, ప్రొడ్యూసర్ ఆరబోతు కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సమీర్ పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles